నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీవీకేకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. దీంతో టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్ అయింది. టీవీకే 108, కాంగ్రెస్ 5, సీపీఐ,సీపీఐ(ఎం) చెరో రెండు, వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే బలం 119కి చేరుకుంది. దీంతో విజయ్ శుక్రవారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. అయితే, అందులో విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107గా మారింది.
The post తమిళనాడులో వీడిన ఉత్కంఠ.. టీవీకేకు సీపీఐ,సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు appeared first on Navatelangana.