← Back to headlines

దొమ్మర కులాన్ని గడవంశీయగా పేరు మార్పు పట్ల హర్షం

2026-05-08 11:24 • original

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
దొమ్మర కులస్తులను, గడ వంశీయ కులస్తులుగా మార్పుకు కృషి చేసిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ,పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, బిర్లా ఐలయ్య లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలేర్ పట్టణంలో శుక్రవారం ఆ సంఘానికి చెందిన సభ్యులు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కులసభ్యులు మహేష్, భాస్కర్, రాములు మానెమ్మ, సుజాత, కృష్ణ ,వెంకటేష్ ,జయంతి, చంద్రమౌళి, నరసింహారావు, సుధాకర్, శంకర్, చందు, సుశీల, భారతమ్మ, అరుణ, నాగమణి, నీలమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

The post దొమ్మర కులాన్ని గడవంశీయగా పేరు మార్పు పట్ల హర్షం appeared first on Navatelangana.