
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మే 10వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే రాయ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా దూరమవుతాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహాగానాలకు ఎంఐ చెక్ పెట్టింది. పాండ్యా రాయ్‌పూర్‌కు చేరుకొని జట్టుతో జతకట్టాడని ఎంఐ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. వెన్నునొప్పి కారణంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌కు హార్థిక్ దూరమైన విషయం తెలిసిందే.
ఈ కారణంగానే అతడు ఆర్సిబితో మ్యాచ్‌కి కూడా దూరమవుతాడని ప్రచారం జరిగింది. అంతేకాక.. ముంబై జట్టుతో పాటు హార్థిక్ రాయ్‌పూర్‌కి వెళ్లలేదని తెలిసింది. కానీ, ఇప్పుడు హార్థిక్ జట్టుతో జతకట్టాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, హార్థిక్ బరిలోకి దిగుతాడా.. లేదా.. అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ముంబై ఈ సీజన్ పేలవ ప్రదర్శన చేస్తుంది. ఆడిన 10 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇకపై ఆడే నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు.