← Back to headlines

అమ్మే ధైర్యం !

2026-05-09 15:00 • original

అమ్మే మంచిదిరా
అని చెప్పిన నాన్న
అమ్మను ఒంటరి చేసి
ముందే వెళ్లిపోయాడు
అమ్మ పిచ్చిదిరా
అని జాలిపడ్డ నాన్న
అమ్మను నిజంగానే
పిచ్చిదాన్ని చేసి
ముందే వెళ్లిపోయాడు
అమ్మకు పుణ్యస్త్రీత్వం
బహుమతిగా
లభించాలనుకున్న నాన్న
అమ్మకు వైధవ్యాన్ని కానుకిచ్చి
ముందే వెళ్లిపోయాడు
మా అందరికీ
అమ్మే ధైర్యమని చెప్పిన నాన్న
మా అమ్మకు మాత్రం
తనే ధైర్యమన్న సంగతి మరిచి
వెళ్లిపోయాడు!
– చిత్తలూరి, 9133832246

The post అమ్మే ధైర్యం ! appeared first on Navatelangana.