నవతెలంగాణ-మద్నూర్
ప్రఖ్యాతిగాంచిన సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి శనీ, సోమ, అమావాస్య, పూర్ణిమ, రోజుల్లో భక్తులు అత్యధికంగా దర్శించుకుంటారు. కోరుకున్న కోరికలు తీరుతాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్ధం ఉదయం టిఫిన్, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు చేపట్టారు. అనంతరం భక్తులకు కాంగ్రెస్ నాయకులు సంఘయప్ప మద్నూరు మూడో వార్డు సభ్యురాలు, కుటుంబ సభ్యులు అనిత గంగాధర్ తదితరులు పాల్గొని టిఫిన్లు, అన్నదానం చేశారు. కాగా నేడు ఆలయాన్ని మూడు రాష్ర్టాలకు సరిహద్దులో ఉన్న భక్తులు భారీగా తరలివచ్చారు.
The post ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ appeared first on Navatelangana.