← Back to headlines

సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు

2026-05-09 13:09 • original

మోడల్, కస్తూరిబ్బా స్కూల్స్ ఎంపిక
15 రోజులపాటు నిర్వహణ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాల్లో వేసవి శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెలవుల్లో ఉన్న పిల్లలకు పలు అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నది.మండలంలో పీఎంశ్రీ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు.ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గం టలకు కొనసాగే శిబిరంలో ఇతర పాఠశాలల విద్యార్థులూ పాల్గొనే అవకాశం కల్పించారు.ఒక్కో స్కూల్లో 100 మంది చొప్పున 200 మంది విద్యార్థులకు క్యాంపులో అవకాశం కల్పిస్తారు.దుబ్బపేట కేజీబీవీలో చదివే 100 అంతకంటే ఎక్కువ మందికి శిక్షణకు ఇవ్వనున్నారు.వీరికి భోజనం తోపాటు వసతి కల్పిస్తారు. విద్యా నైపుణ్యాలు పెంచడం,వ్యక్తిత్వ వికాస్తారు.వేసవి శిబిరం నిర్వహించదానికి ప్రభుత్వం రూ.50 వేలు మంజురు చేసింది. ఉదయం స్నాక్స్ కోసం రూ.15 వేలు, వంట మనిషికి రూ.4 వేలు, శిక్షకులకు రూ.12 వేలు, మెటీరియల్ కోసం రూ.10 వేలు కేటాయించనున్నారు. శిబిరాల బాధ్యతలను ప్రధానోపాధ్యాయుడితోపాటు సీనియర్ టీచర్లకు అప్పగించారు.

నేర్పించే అంశాలు..
వ్యాయామం,సంగీతం, నృత్యం,డ్రాయింగ్, యోగా, కథలు చెప్పడం,చెస్, క్యారంతోపాటు ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ పోటీలు ఉంటాయి.

The post సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు appeared first on Navatelangana.