← Back to headlines

శ్రీశైలం యాత్రికులను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

2026-05-09 11:31 • original

శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగు చూసింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల భక్తలను టార్గెట్ చేసుకొని కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఆనంద్‌కుమార్ శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసి గదులను వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు పేటిఎం ద్వారా రూ.15 వేలు చెల్లించారు. శనివారం 27 మంది యాత్రికులు హైదరాబాద్‌ నుంచి ఓ టూరిస్ట్ బస్సులో శ్రీశైలం వచ్చారు. మల్లికార్జున సదన్‌లో గదుల కోసం అడగ్గా అక్కడ గదులు బుకింగ్ కాలేదని తెలిసింది. దీంతో మోసపోయినట్లు యాత్రికులు గుర్తించారు. ఈ ఘటనపై శ్రీశైలం ఆలయ ఇవొ శ్రీనివాస రావు స్పందించారు. యాత్రికులకు అండగా నిలిచారు. వారికి ఉచిత వసతి, భోజన, దర్శన ఏర్పాట్లు చేయించారు. భక్తుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదును పిఆర్‌వొ తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల మోసం కేసు పెట్టాలని ఇవొ నిర్ణయం తీసుకున్నారు.