← Back to headlines

జగన్ పాలనలో కొర్రపాడు రోడ్లన్నీ గుంతలమయం: జనార్థన్

2026-05-09 10:38 • original

అమరావతి: అభివృద్ధితో కూటమి ప్రభుత్వ పాలన మొదలైందని ఎపి మంత్రి బిసి జనార్థన్ రెడ్డి తెలిపారు. విధ్వంసంతో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలైందని అన్నారు. ప్రొద్దుటూరు లోని కొర్రపాడు రోడ్డు విస్తరణకు మంత్రి జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి రూ. 5 కోట్ల పనులకు శిలాఫలకం జనార్థన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి పాలనలో రోడ్లన్నీ గుంతలమయమేనని, 9 నెలల్లోనే రూ. 1,080 కోట్లతో గుంతల్లేని రాష్ట్రంగా మార్చామని తెలియజేశారు. ఆర్ అండ్ బి శాఖను జగన్ నిర్వీర్యం చేశారని జనార్థన్ విమర్శించారు.