← Back to headlines

సన్‌స్క్రీన్ తో ప్రయోజనాలు

2026-05-08 19:37 • original

సన్ స్కీన్ వల్ల ఎండ వల్ల చర్మం ఎర్రబడటం, మంట పుట్టడ, పొట్టు ఊడటం వంటి సమస్యల్ని తగ్గించడంలో సన్‌స్క్రీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అయితే, సన్‌స్క్రీన్ వాడటం వల్ల ఈ సమస్యను నివారిస్తుంది. ఎక్కువకాలం పాటు వడ దెబ్బ లేదా ఎండ దెబ్బ తగిలితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి సన్‌స్క్రీన్ ఉత్తమ మార్గం. అంతేకాదు చర్మం నల్లబడకుండా, మచ్చలు పడకుండా సమానమైన రంగులో ఉంచడానికి సన్‌స్క్రీన్ సాయపడుతుంది. సరైన సన్‌స్క్రీన్‌ను ఎలా ఎంచుకోవాలి? అయితే, అన్ని సన్‌స్క్రీన్‌లు ఒకేలా ఉండవు. అందుకే కొనేటప్పుడు రెండు విషయాల్ని గమనించాలని డాక్టర్ చెబుతున్నారు. ​బ్రాడ్ స్పెక్ట్రమ్ : ఇది UVA అంటే ముడతలు కారణమయ్యే కిరణాలు, UVB అంటే సన్‌బర్న్‌కి కారణమయ్యే కిరణాల నుంచి రక్షిస్తుంది. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ: కనీసం SPF 30 ఉన్న దానిని వాడటం వల్ల దాదాపు 97% కిరణాలను అడ్డుకోవచ్చు. చర్మ రకాన్ని బట్టి ఎంచుకోండి సన్‌స్క్రీన్ రాసుకున్నప్పుడు ముఖం జిడ్డుగా లేదా మరీ తెల్లగా కనిపించకుండా ఉండాలంటే స్కిన్ టైప్‌కి తగ్గట్టుగా కొనాలి. ​
జిడ్డు చర్మం : ఇలాంటి చర్మ రకం ఉన్నవారు ‘జెల్ బేస్డ్’ లేదా ‘Matte finish’ ఉన్న సన్‌స్క్రీన్‌ల్ని ఎంచుకోవాలి. ఇవ చర్మంపై జిడ్డును పెంచదు.
పొడి చర్మం : పొడి చర్మంతో బాధపడేవారు ‘క్రీమ్ బేస్డ్’ లేదా మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్‌ వాడాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
సున్నితమైన చర్మం : ఈ చర్మ తత్వం ఉన్నవారు కెమికల్స్ తక్కువగా ఉన్న ‘మినరల్ సన్‌స్క్రీన్’ అంటే జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉన్నవి వాడటం మంచిది. వాడే విధానం (ఎలా వాడాలి?)
సమయం: ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అప్పుడే అది చర్మంలోకి ప్రవేశించి రక్షణనిస్తుంది.
పరిమాణం: కేవలం ముఖానికే కాకుండా మెడ, చేతులు, పాదాలు ఇలా ఎండ తగిలే ప్రతి శరీర భాగంపై అప్లై చేసుకోవాలి.
మళ్లీ రాయడం: ఒక్కసారి రాస్తే రోజంతా ఇది పనిచేయదు. ప్రతి 2 నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాసుకోవాలి. ఎక్కువగా చెమట పడుతున్నా లేదా స్విమ్మింగ్ చేస్తున్నా ఇంకా త్వరగా రాసుకోవాలి.

The post సన్‌స్క్రీన్ తో ప్రయోజనాలు appeared first on Navatelangana.