← Back to headlines

అగ్నిపర్వతం పేలుడు.. ముగ్లురు క్లైంబర్స్ దుర్మరణం

2026-05-08 17:37 • original

ఇండోనేసియాలో అగ్నిపర్వతం పేలుడు ఘటనలో కనీసం ముగ్గురు పర్వతారోహకులు మృతి చెందారు. ఇండోనేసియా మారుమూల దీవి హల్మాహెరాలో మౌంట్ దుకోనో గురువారం పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లారు. ఇదే దశలో అగ్నిపర్వతం బద్దలు అయింది. 1355 మీటర్ల ఎతైన గుట్టల వద్దకు వెళ్లుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం పర్వతారోహకులకు నిషిద్ధ ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ వీరు ఈ ప్రమాద భరిత మార్గంలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని ఈ ప్రాంతపు పోలీసు అధికారి ఎర్లిచ్‌సన్ పసరిబు తెలిపారు.