← Back to headlines

ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

2026-05-08 15:24 • original

నవతెలంగాణ-కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లతో మంజూరు చేసిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 2026 మే 25వ తేదీలోగా పనులను పూర్తి చేసి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, మహిళా సాధికారతకు ఇందిరా మహిళా శక్తి భవనం వేదిక కావాలన్నారు. భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. నిర్దేశించిన గడువులోగా, అన్ని సౌకర్యాలతో పనులు పూర్తి చేయాలి. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఓ సురేందర్, డీపీఆర్ఈ దుర్గాప్రసాద్, పీఆర్ డీఈఈ స్వామి దాస్, డీ పీ ఆర్ ఓ తిరుమల. ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

The post ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ appeared first on Navatelangana.