← Back to headlines

పోలీసులపై ఆరోపణలు అవాస్తవం

2026-05-08 14:13 • original

డీఎస్పీ సత్తయ్య గౌడ్
నవతెలంగాణ-కొండాపూర్

కొండాపూర్ మండలం తోగర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి పోలీసులపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. అలియాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారనే ఫిర్యాదుతో శ్రీధర్ రెడ్డిని స్టేషన్‌కు పిలిచామని చెప్పారు. మహిళా పోలీసు అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చర్యలు తీసుకున్నామని వివరించారు. సమస్యలు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సీఐ సుమన్, ఎస్సై సోమేశ్వరి పాల్గొన్నారు.

The post పోలీసులపై ఆరోపణలు అవాస్తవం appeared first on Navatelangana.