← Back to headlines

‘విశ్వంభర’ గురించి రకరకాల పుకార్లు.. దర్శకుడి రియాక్షన్ ఇదే..

2026-05-11 05:52 • original

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా గురించి అప్‌డేట్స్ ఏమీ రావడం లేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఈ సినిమాపై పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌పై దర్శకుడు వశిష్ట స్పందించారు. ‘అవునా.. నిజమా’ అంటూ నవ్వుతోన్న ఎమెజీలను జోడించారు. దీంతో ఈ పుకార్లకు పరోక్షంగా చెక్‌ పెట్టినట్లైంది. ఒకే భాగంలో ఈ సినిమా రానుందని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష, అషికాలు నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో చిరు నాగిని సిరీయల్ ఫేమ్ మౌనీ రాయ్‌తో ఓ ప్రత్యేక పాటకి స్టెప్పులేశారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.