← Back to headlines

బయట దళారుల భోజ్యం..... లోపల రాబందుల రాజ్యం

2026-05-11 06:19 • original

గద్వాల కార్మిక శాఖలో గలీజు అవినీతి

కార్మికుల రెక్కల రక్తం తాగుతున్న తోడేళ్లు

అవినీతికి కేరాఫ్‌గా కార్యాలయం

పైరవీ కారులకే పెద్ద పీట

పైసలిస్తేనే బీమా, పెళ్లి కానుకలు మంజూరు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : గ ద్వాల జిల్లా కార్మిక శాఖ కార్యాలయం అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. కాయకష్టం చే సుకునే కార్మికుల చెమట చుక్కల్ని కొందరు కా ర్మిక శాఖ అధికార సిబ్బంది తోడేళ్లగామారి హరి ంచి వేస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని అసంఘిటి, సంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమపథకాలు అందిస్తు న్న విషయం తెలిసిందే. ఈ పథకాలను నిజాయితిగా అందించాల్సిన గద్వాల కార్మిక శాఖ అధికారులు లంచాలకు అలువాటు పడి అందిన కాడికి దోచుకుంటున్నారు. లేబర్ కార్డులు మొదలుకొని, కార్మికుల భీమా సొమ్ము దగ్గర, నుంచి ప్రసవాని కి వచ్చే ఉచిత డబ్బుల్లో కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. కార్మికుల గురించి పోరాటాలు చేస్తున్నామని చెప్పే కొన్ని కార్మిక సంఘాల్లోని కొ ందరు దళారుల సైతం కార్మికులను నిండుగా ము ంచుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గద్వా ల జిల్లాలోనే సుమారు 100 మందికి పైగా దళారులు ఇదే పని మీద ఉన్నట్లు తెలుస్తోంది.

కార్మికులకు చెందాల్సినవి ఇవే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఒక గుర్తిం పు, వారికి సత్వర న్యాయం దక్కేందుకు పథకాల ను దళారులు లేకుండా సజావుగా అమలు చేసేందుకు లేబర్ కార్డులను ప్రవేశ పెట్టింది. అయితే ఆ కార్డులను ఎలా పొందాలో తెలియన కార్మికులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు అన్ని పూర్తి చేస్తే రూ. 110 చెల్లిస్తే లేబర్ కార్డు వస్తుంది. ఇది అన్ని మీ సేవా కేంద్రాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. అయితే వీటిపై అవగాహన లేని కార్మికుల, శ్రామికులు మద్య దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఒక్కో లేబర్ కార్డుకు రూ. 500 నుంచి రూ. 1000 దాక చెల్లించుకుంటున్నారు. కార్డు పొంది న కార్మికులకు ప్రభుత్వాలు అన్ని విధాలు అండా ఉండనున్నాయి. కార్మికుడి కుటుంబంలో వివాహ కానుకగా రూ. 40 వేలు, కాన్పు సమయంలో రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. అదే విధంగా కార్మికుడు సాధారణ మరణం పొం దితే రూ. 60, అంత్యక్రియలకు రూ. 20 వేలు, యూనివర్సిల్ హెల్త్ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా రూ. 2.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్ర మాదవ శాత్తు చనిపోతే రూ.6 లక్షలు వరకు ప్ర భుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దుకాణా లు, సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థల్లో పని చేసే వారికి ఈ పథకాలు వర్తిస్తాయి. వేతనాలు, బోనస్, గ్యాట్యిటి, పని గంటలు,సెలవులు బద్రత వంటివి కార్మిక సంక్షేమ బోర్డు పథకాలుగా ఉన్నాయి.


 



బయట దళారుల బోజ్యం,

లోపల రాబందుల రాజ్యం

కార్మికులను లేబర్ కార్డుతో పాటు పైరవీలు చేసే దళారులు కార్మికులను ఒక రకంగా మోసం చే స్తుండగా, కార్మిక శాఖలోని అధికార సిబ్బంది రా బందుల్లా మారీ పీల్చుకుతింటున్నారు. లేబర్ కా ర్డుల పేరుతో దళారులు దోపిడి చేయగా, దరఖాస్తులు చేసుకునే దరఖాస్తు ఫారం నుంచి భీమా సొ మ్ము మంజూరు వరకు కార్మిక శాఖలోని అధికారులు బోంచేస్తున్నారు. ఇలా రెండు వైపులా కార్మికులు మోసంకు గురి అవుతున్నారు. కాన్పు సమయంలో రూ. 20 వేల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కార్యాలయంలో రూ. 4 వేలు చెల్లించాల్సి అదే విధంగా భీమా సొమ్ము చెల్లించాలంటే రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని కార్మికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. వీటిలో కూడా అడ్వాన్సులు తీసుకుంటూ మిగతాది మంజూరై చెక్ ఇచ్చే సమయం లో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల మల్దకల్, ధరూర్‌లో కార్మికులు చనిపోతే ఆయన భీ మా సొమ్మును దళారులు, అధికార సిబ్బంది మో సం చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ధరూర్‌లో కుట్టు మిషన్లు ఇప్పిస్తామని చెప్పి 100 మంది మహిళల దగ్గర డబ్బలు కలెక్షన్లు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇక బాల కార్మికుల సంక్షేమాన్ని కూడా ఈ శాఖ పరిధిలోకే వస్తుంది. కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో బాలకార్మికులు పని చేస్తున్నారు. వారి గురించి ఈ శాఖ అధికారులు పట్టించుకున్న పా పాన పోలేదు. గద్వాల జిల్లాలో సీడ్ పత్తి ఎక్కవగా పండిస్తున్నారు. ఈ పనికి బాలకార్మికులనే పనిగా పెట్టుకుంటున్నా అధికారులు ఎలాంటి కేసులు న మోదు చేయడం లేదన్నది చేదు వాస్తవం. ఇక హో టళ్లు, చిన్న దుకాణాల్లో కూడా వారు పని చేస్తు న్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

దళారులతోనే కుమ్మక్కు

ఈ కార్యాలయంలో పని చేసే ఇద్దరు సిబ్బంది ఇ దే పనిగా పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. కార్యాలయంలో ఏ పని కావాలన్నా నేరుగా వెళ్లే క నీసం పలకరించు నాధుడే ఉండరని కార్మికులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల ద్వారా వెళ్తేనే పనులు అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ద ళారులతో నడిపిస్తున్న ఇద్దరు సిబ్బంది ఇప్పటికే క మీషన్ల రూపంలో లక్షలు ఆర్జించినట్లు సమాచా రం. ఇందులో పై అధికారులకు వాటాలు ఉండడంతో వారు మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణ లు వ్యక్తం అవుతున్నాయి. ఇక కోర్టు కేసుల్లో కూ డా కమీషన్లు ఉంటేనే కేసులు త్వరగా పరిష్కా రం అవుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇందులో పని చేసే వారిని ప్రక్షాళన చేయడంతో పాటు కమీషన్ల దం దాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు.