← Back to headlines

తెలంగాణను అభివృద్ధి చేయడమే మోడీ లక్ష్యం: రామచందర్ రావు

2026-05-11 08:56 • original

హైదరాబాద్: ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని తెలంగాణలో రాజకీయ మార్పు జరగబోతుందని టిబిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడం, తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాల ఓట్లతోనే టిఎంసి, వామపక్షాలు గెలిచాయని, ఎస్ఐఆర్ లో దొంగ నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తామని అన్నారు. ఎన్నికలు లేకున్నా మోడీ సభను ప్రజలను ఆదరించారని, ఆదివారం సభకు సహకరించిన అందరికీ  రామచందర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు.