← Back to headlines

కొనసాగుతున్న అల్పపీడనం.. వారం రోజుల్లో ఎపిలో వర్షాలు

2026-05-11 12:05 • original

అమరావతి: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.