
ధర్మశాల: ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుని ముందుగా పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ఇక, వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో ఢిల్లీతో పోరు పరీక్షగా తయారైంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటములతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటోంది. అంతేగాక ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. పంజాబ్ పై గెలిచి మళ్లీ గాడిలో పడాలని ఢిల్లీ భావిస్తోంది.