
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, ఎన్. రాధాబాయి, ఉజ్మ ఆషాయ్ షకీరాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జివో జారి చేసింది.
ఇదిలాఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవీ కాలం ముగిసి ‘మాజీ’ కాగానే ఆమెకు మహిళా కమిషన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని మన తెలంగాణ పత్రికలో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘మేయర్ మాజీ కాగానే&తాజా పదవి ?’ శీర్షికతో మన తెలంగాణ పత్రిక ఫిబ్రవరి 9న వార్త ప్రచురించింది.