← Back to headlines

అద్దె ఇంటి లోకి మాజీ సిఎం పినరయి విజయన్

2026-05-11 17:45 • original

తిరువనంతపురం: ఎల్‌డిఎఫ్ ఓటమి పొందిన నేపథ్యంలో మాజీ సిఎం, సీనియర్ సిపిఎం నేత పినరయి విజయన్ సోమవారం అద్దె ఇంటిలోకి మారారు. న్యూఢిల్లీలో సిపిఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన తరువాత సిఎం పదవికి రాజీనామా చేసి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌ను ఖాళీ చేశారు. తిరువనంతపురం లోని బేకరీ జంక్షన్ వద్ద అద్దె ఇంటిలోకి సోమవారం రాత్రి తరలి వెళ్లారు. ఆయన అల్లుడు, మాజీ మంత్రి పిఎ మొహమ్మద్ రియాస్, సీనియర్ సిపిఎం నేత వి శివన్‌కుట్టి, కొత్త నివాసంలో విజయన్‌కు స్వాగతం పలికారు.