← Back to headlines

అత్యంత బలహీన స్థితిలో ఇరాన్ కాల్పుల విరమణ : ట్రంప్

2026-05-11 17:57 • original

వాషింగ్టన్ : అమెరికాఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత బలహీన స్థితిగా మారిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తన శాంతి ప్రతిపాదనలో భాగంగా పంపిన నివేదికను ట్రంప్ “ చెత్త” అని కొట్టి పారేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం “ఒకశాతం మాత్రమే జీవించే అవకాశం ఉన్న రోగిలా ” ఉందని పేర్కొన్నారు. ఇరాన్ తన 10 పాయింట్ల ప్రతిపాదనలో యుద్ధ పరిహారం, హర్మూజ్ జలసంధిపై సార్వభౌమాధికారం, ఆంక్షల ఎత్తివేత, చమురు విక్రయాలపై నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిని అమెరికా అంగీకరించలేదు. ఇరాన్ తన ప్రతిపాదనను సమర్ధించుకుంటూ ,అమెరికా జోక్యాన్ని సార్వభౌమాధికార ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది.