← Back to headlines

లిక్కర్ షాపులపై సిఎం విజయ్ సంచలన నిర్ణయం..

2026-05-12 05:07 • original

తమిళనాడు ముఖ్యమంత్రి సిఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. లిక్కర్ షాపుల మూసివేతపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల దూరంలో ఉన్న లిక్కర్‌ షాప్‌లను మూసివేయాలని అధికారులకు సిఎం విజయ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూసివేతకు రెండువారాల గడువు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 717 లిక్కర్‌ దుకాణాలు మూత పడనున్నాయి.