← Back to headlines

భారీగా పెరిగిన మహిళల హెల్త్ క్లెయిమ్‌లు: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

2026-05-10 14:50 • original

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రసూతి ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఆసుపత్రుల్లోనే ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం... ప్రస్తుత ప్రసవాల్లో 88-90% ఆసుపత్రుల్లోనే జరుగుతుండగా, 2023-24 నాటికి ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీల వాటా ఏకంగా 97.3 శాతానికి చేరుకుంది. ఆసుపత్రుల ఆధారిత మాతృ సంరక్షణ వైపు వస్తున్న స్థిరమైన మార్పుకు ఇది నిదర్శనం. అలాగే 2024-25లో దేశంలో నమోదైన మొత్తం జననాల్లో సి-సెక్షన్ డెలివరీలు 27 శాతానికి పైగా ఉన్నట్లు 2025లో ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ప్రసూతి సమయంలో మెరుగైన వైద్యం, జాగ్రత్తల పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది నొక్కిచెబుతోంది.

ఈ నేపథ్యంలో.. మహిళల హెల్త్ క్లెయిమ్‌ల సంఖ్య, తీవ్రత రెండూ స్పష్టంగా పెరుగుతున్నాయని 'కేర్ హెల్త్ ఇన్సూరెన్స్' తాజా నివేదిక వెల్లడించింది. ఎఫ్‌వై25 నుంచి ఎఫ్‌వై26 నాటికి మహిళల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు 37% పెరిగాయి. ముఖ్యంగా ఈ వృద్ధిలో 20-40 ఏళ్ల వయసున్న కేటగిరీ వారు ముందున్నారు. ఇదే సమయంలో వీరి క్లెయిమ్‌లు 25% పెరిగాయి.

అదే సమయంలో మెటర్నిటీకి సంబంధించిన క్లెయిమ్‌ల ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాలు మొత్తం క్లెయిమ్‌లలో పెద్ద వాటాను ఆక్రమిస్తున్నాయి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు నమోదైన మొత్తం మెటర్నిటీ క్లెయిమ్‌లలో 60 శాతం ఈ నగరాల నుంచే వస్తుండటం గమనార్హం. మరోవైపు తల్లుల వయసుకు సంబంధించిన ప్రొఫైల్‌లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎఫ్‌వై26లో మొత్తం మెటర్నిటీ క్లెయిమ్‌లలో 35 ఏళ్లు పైబడిన మహిళల వాటా 12 శాతంగా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది ఎక్కువ. మొత్తం క్లెయిమ్ అమౌంట్‌లో ఈ వయస్సు వారి ఖర్చుల వాటా ఏకంగా 18 శాతంగా ఉంది. లేట్ ప్రెగ్నెన్సీల వల్ల ఖర్చుల తీవ్రత పెరుగుతోందని ఇది సూచిస్తోంది.

గత రెండేళ్లలో ఓవరాల్ మెటర్నిటీ క్లెయిమ్ చెల్లింపులు 25 శాతం పెరిగింది. క్లెయిమ్‌ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఒక్కో కేసుకు సగటున వెచ్చిస్తున్న ఖర్చు పెరుగుతుండటం గమనార్హం. డెలివరీలు ఆసుపత్రుల్లో సురక్షితంగా జరుగుతూ మెరుగైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. ప్రసవానంతరం ఐదు రోజుల్లోపు డిశ్చార్జ్ అవుతున్న మహిళల శాతం ఎఫ్‌వై24లో 75% నుంచి ఎఫ్‌వై26 నాటికి 82 శాతానికి పెరిగింది. అయితే, ఇలా త్వరగా డిశ్చార్జ్ అవుతున్నప్పటికీ మెటర్నిటీ ట్రీట్‌మెంట్ ఖర్చుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదని, పైగా పెరుగుతున్న ట్రెండ్‌ను కంపెనీ గమనించింది.

మొత్తంగా చూస్తే.. మెటర్నిటీ హెల్త్‌కేర్‌లో వస్తున్న స్ట్రక్చరల్ మార్పులు, పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక భారాన్ని ఎలా పెంచుతున్నాయో ఈ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. మెజారిటీ మహిళలు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందుతున్నప్పటికీ, ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు ఇప్పటికీ తగినంత ఐరన్ లేని ఆహారం తీసుకుంటున్నారని పబ్లిక్ హెల్త్ డేటా ద్వారా స్పష్టమవుతోంది. ఇది వారిలో పోషకాహార లోపాలను, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెలియజేస్తోంది.

ఈ నివేదికపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ మనీష్ దొడేజా మాట్లాడుతూ.."మహిళల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఇకపై సాధారణ గ్రోత్ ప్యాటర్న్‌లో ఉండవు. వాటి స్కేల్, కాస్ట్ ఇంటెన్సిటీ రెండూ భారీగా విస్తరిస్తున్నాయి. మెటర్నిటీ ల్యాండ్‌స్కేప్‌లో వస్తున్న స్పష్టమైన మార్పులను, క్రమంగా పెరుగుతున్న ఖర్చులను మేము గమనిస్తున్నాము.

కేర్ పాత్‌వేస్ మరింత సమర్థవంతంగా మారుతున్నప్పటికీ, మెటర్నిటీ హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. ఇది కేవలం ఆసుపత్రుల వినియోగానికి సంబంధించిన ట్రెండ్ మాత్రమే కాదు; నేటి మహిళలు ఆరోగ్య సేవలను ఎలా పొందుతున్నారు, ఆ అనుభూతిలో వస్తున్న విస్తృతమైన మార్పును ఇది ప్రతిబింబిస్తోంది. కాబట్టి, మారుతున్న అవసరాలకు అనుగుణంగా తగిన కవరేజ్ ఉండేలా వ్యక్తులు ఎప్పటికప్పుడు తమ ఇన్సూరెన్స్‌ను సమీక్షించుకోవడం చాలా ముఖ్యం" అని అన్నారు.

మెటర్నిటీ హెల్త్‌కేర్ వినియోగం పెరుగుతున్న కొద్దీ, ఆర్థిక భారాన్ని సులభంగా నిర్వహించడానికి మరియు నిరంతర సంరక్షణను పొందడానికి తగినంత, సకాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండటం ఎంతో కీలకం.

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి:

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రిటైల్ విభాగంలో హెల్త్ ఇన్సూరెన్స్, టాప్-అప్ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్, మెటర్నిటీ, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్‌నెస్ కోసం ఉత్పత్తులను అందించే ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరర్. అలాగే కార్పొరేట్లకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రామీణ మార్కెట్లకు మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మరియు సమగ్ర వెల్‌నెస్ సేవలను సంస్థ అందిస్తోంది.

కస్టమర్ సంతృప్తి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. కస్టమర్ సర్వీస్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ మరియు వాల్యూ-ఫర్-మనీ సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు అందించేందుకు టెక్నాలజీపై నిరంతరం పెట్టుబడులు పెడుతోంది.

డిసెంబర్ 2025లో జరిగిన 'ఈటీ నౌ ఇన్సూరెన్స్ సమిట్ & అవార్డ్స్ 2025'లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ.. హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో ప్రతిష్ఠాత్మక 'స్మార్ట్ ఇన్సూరర్' మరియు 'సేల్స్ ఛాంపియన్' అవార్డులను గెలుచుకుంది.