
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సినీనటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ ఫ్యాన్స్ ఆమెను చూడగానే విజిల్స్, కేరింతలకు దిగారు. దీనితో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. వేదిక వద్ద సందడిగా త్రిష కృష్ణన్ కన్పించారు. విజయ్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం ఉన్న త్రిష సంప్రదాయక నీలం రంగు పట్టుచీర, మ్యాచింగ్‌గా క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు. వజ్రాల నెక్లెస్‌తో, సాదాసీదా మేకప్‌తో, నుదుటిన చిన్నబొట్టుతో వచ్చారు.
ఓ వైపు త్రిష ప్రత్యేక ఆకర్షణ కాగా.. విజయ్ బార్య సంగీత సోర్నలింగం, పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు కార్యక్రమానికి రాకపోవడం పలు ఊహాగానాలకు దారితీసింది. త్రిషతో విజయ్ అనుంంధం పట్ల ఆగ్రహంతో ఉన్న భార్య విడాకులకు సెటిల్మెంట్‌కు దిగిందని ఎన్నికల ప్రచార సమయంలోనే స్పష్టం అయింది. భార్య పిల్లలు ఇంత పెద్ద కార్యక్రమానికి రాకపోవడంతో వారి పట్ల సానుభూతి వ్యక్తం అయింది.