
హైదరాబాద్: కాంగ్రెస్, అంతకు ముందు పాలించిన బిఆర్‌ఎస్‌ల పాలనలో తెలంగాణ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. పరేడ్‌గ్రౌండ్ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ఎనిమిది లోక్‌సభ, రెండు ఎమ్మెల్సీలు గెలిచామని చెబుతూ రానున్న ఎన్నికల నాటికి బిజెపి జెండా తెలంగాణలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బిఆర్‌ఎస్ కుటుంబ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో తెలంగాణ తల్లి విలవిల్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి ఏదైనా హామీ ఇస్తే అమలు చేసి చూపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌లో అసలు హిందూయిజమే లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంతో ఉందన్న ఆయన హైస్పీడ్ రైళ్ల నుంచి ఎన్నో రంగాల్లో కేంద్రం లక్షల కోట్ల నిధులు ఇవ్వడం వల్ల అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఇంకా సన్నబియ్యం సరఫరాలో 80 శాతం కేంద్ర నిధులు ఉన్నాయని గుర్తు చేశారు.