← Back to headlines

మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే తోట

2026-05-08 13:35 • original

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ ను కలిశారు. ఇందుల భాగంగా నియోజకవర్గoలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు నియోజకవర్గానికి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, పోడు భూముల క్రమబద్ధీకరణ, ఎల్లారం తండాకు సంబంధించిన రెవిన్యూ రికార్డుల సమస్యను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇందుకు మంత్రి స్పందిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగులో ఉన్న అన్ని దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలకు స్వంత ఇంటి కల సాకారం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు.

The post మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.