← Back to headlines

రేపు తాడిచెర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

2026-05-08 13:37 • original

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఇంఛార్జి ఏఈ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులకు, రైతులు సహకరించాలని కోరారు. 33కేవీ  లైన్ లో పనులు,చెట్లు నరికివేత జరుగుతున్నందున తాడిచెర్ల,మల్లారం, పెద్దతుండ్ల సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ఫీడర్స్ విద్యుత్తు సరఫరాకు ఉదయం 7 నుండి 10:30 వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు.

The post రేపు తాడిచెర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం appeared first on Navatelangana.