← Back to headlines

వెంకటంపల్లిలో చలివేంద్రం…

2026-05-08 13:46 • original

నవతెలంగాణ–వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలు, రైతుల సౌకర్యార్థం గ్రామ సర్పంచ్ , పాలకవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవునూరి లక్ష్మీ చిన్న నరసయ్య మాట్లాడుతూ.. మండుతున్న వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తమ వంతు బాధ్యతగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, ప్రయాణికులు, రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిచాల మల్లేశం, వార్డు సభ్యులు బండ బాబు, ఆవునూరి లక్ష్మి, పసునూరి స్వరూప, మారా అనిల్, నారెడ్డి దయాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ యాదవ్, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఆవునూరి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎండలు ముదురుతున్న వేళ గ్రామ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

The post వెంకటంపల్లిలో చలివేంద్రం… appeared first on Navatelangana.