← Back to headlines

సీఎం విజ‌య్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంఎ. బేబి

2026-05-10 11:39 • original

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకె అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్‌కు సీపీఐ(ఎం) అభినందనలు తెలిపింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆదివారం ఎక్స్ వేదికగా సిఎం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం (టివికె) అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్ కు అభినందనలు. లౌకికవాదం, ప్రజా సంక్షేమం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం సూత్రాలను నెలబెట్టే, తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మీకు, మీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు ” అని పేర్కొన్నారు.

The post సీఎం విజ‌య్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంఎ. బేబి appeared first on Navatelangana.