← Back to headlines

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుంది: మోడీ

2026-05-10 11:27 • original

హైదరాబాద్: దేశాభివృద్ధి లో సైబరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అనేక ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ లో నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసి లో మోడీ ప్రసంగించారు. సైబరాబాద్ అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని, సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఇవి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. వరంగల్ పిఎం మిత్ర టెక్స్ టైల్స్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషకరమని, దేశ టెక్స్ టైల్స్ రంగంలో వరంగల్ పిఎం మిత్ర పార్కు కీలకపాత్ర పోషించనుందని తెలియజేశారు. వరంగల్ పిఎం మిత్ర పార్కుతో ఉద్యోగావకాశాలు భారీగా వస్తాయని, హైవేలపై కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని మోడీ పేర్కొన్నారు. ఉమ్మడి ఎపికి రైల్వే బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కూడా దక్కేవి కావని, ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ. ఐదున్నర వేల కోట్లు కేటాయించామని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ..ఇది వింటున్నారా? తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందని, తెలంగాణ వికసిస్తే.. దేశం వికసిస్తుందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదని, రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారని, తాను కూడా మాట్లాడలేనని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.