← Back to headlines

కాంగ్రెస్ మండలాధ్యక్షునికి ఘన సన్మానం

2026-05-10 09:43 • original

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన దరాస్ సాయిలుకు మండల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్ నాయకులు ఆయనకు ఆదివారం ఘన సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం అవల్ గావ్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షుడు, ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ క్రమంలో అవల్గాం గ్రామ  వార్డ్ మెంబర్లు, మారుతి కిసర్ వార్, రాజప్ప, యాదవ్ బొండ్లవార్, వార్డ్ మెంబర్ భర్త దీప యాదవ్,  కాంగ్రెస్ నాయకులు వినోద్ పటేల్, కైలాష్ మహంత్వార్, బాబు పటేల్, పుండ్లిక్,గొళ్ళెవార్ విట్టల్, మ్యాకలవార్ హన్మండ్లు, లక్ష్మణ్,చిక్కల్ వార్ ధనరాజ్ లు సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ హై కమాండ్ తనపై నమ్మకంతో  రెండోసారి అధ్యక్షునిగా నియమించడం, మండల బాధ్యతలు  తనకు అప్పగించడం, మద్నూర్ మండలం లో ఉన్న  అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండ గంగాధర్  తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ  మండల అధ్యక్షులు  ప్రత్యేక అభినందనలు తెలిపారు.

The post కాంగ్రెస్ మండలాధ్యక్షునికి ఘన సన్మానం appeared first on Navatelangana.