నవతెలంగాణ-మద్నూర్
ఆదివారం మద్నూర్ నుండి బిచ్కుంద కు వెళ్తున్న స్ప్రైట్, థమ్సప్(కూల్ డ్రింక్స్) వాహనం టైరు పేలి బోల్తా పడింది. దీంతో వాహనంలోని కూల్ డ్రింక్స్ జాతీయ రహదారిపై చెల్లా చెదరుగా పడిపోయాయి. ఇందులో చాలా వరకు శీతల పానియాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన 161వ జాతీయ రహదారిపై రుశేగావ్ గెట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అదేవిధంగా బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తరలించారు. అనంతరం కూల్ డ్రింక్స్ ఏజెన్పీ యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
The post కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు appeared first on Navatelangana.