← Back to headlines

మాదాపూర్ నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

2026-05-10 09:24 • original

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నీటి సమస్యను గ్రామ సర్పంచ్ బుక్కావార్ ఆశ చందర్ పాటిల్ ఆదివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో నీటి సమస్య కొనసాగుతూ ఉండేదని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం బోరు మోటారు కాలిపోవడమే అని చెప్పారు. శాశ్వత పరిష్కారం కొరకు పరిష్కరించేందుకు గ్రామస్తుల సహకారంతో మోటారును రిపేరు చేయించామని తెలిపారు. దీంతో గ్రామస్థులకు ఇక మీదట నుంచి నీటి సమస్య శాశ్వతంగా ఉండబోదని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, చెండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్, మాదాపూర్ జిపి కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు అశోక్ పటేల్ , రాజు పటేల్ , మాజీ సర్పంచ్ దినేష్, గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.

The post మాదాపూర్ నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ appeared first on Navatelangana.