← Back to headlines

బీజేపీ పాల‌న‌లో ఈడీ, సీబీఐ దుర్వినియోగం: పంజాబ్ మంత్రి

2026-05-10 08:59 • original

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈడీ( Enforcement Directorate), సీబీఐల‌ను బీజేపీ ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని పంజాబ్ మంత్రి హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆరోపించారు. మ‌నీలాండ‌రింగ్ నెపంతో మంత్రిని సంజ‌య్ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. స‌హ‌చ‌ర మంత్రి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

“ఆపరేషన్ లోటస్” పేరుతో ప్రజలను భయపెట్టి BJPలో చేర్చుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరేలా ఒత్తిడి చేయడానికి కేంద్ర సంస్థలను మోడీ స‌ర్కార్ వినియోగిస్తోంద‌ని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బెంగాల్‌లో ప్రయోగించిన అదే ఎత్తుగడలను ఇప్పుడు పంజాబ్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అయితే, పంజాబ్‌లో జ‌ర‌గ‌నివ్వమ‌ని’ ఆయ‌న‌ దీమా వ్య‌క్తం చేశారు.

The post బీజేపీ పాల‌న‌లో ఈడీ, సీబీఐ దుర్వినియోగం: పంజాబ్ మంత్రి appeared first on Navatelangana.