← Back to headlines

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టుపై ఇరాన్ కీల‌క వ్యాఖ్య‌లు

2026-05-10 08:34 • original

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టారు. ఈ మేరకు కరోలిన్ తన సామాజిక మాధ్యమ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పోస్టుపై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. మొదట కరోలిన్ లీవిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో, మినాబ్ ఘటనను ప్రస్తావించింది. పిల్లలు అమాయకులని, వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదని తెలిపింది. కానీ మినాబ్‌లోని పాఠశాలలో మీ బాస్ హత్య చేసిన పిల్లలు కూడా మీలాంటి తల్లులు తొమ్మిది నెలలు మోసి కన్నవారే కదా అని పేర్కొంది. మీరు మీ బిడ్డను ముద్దు పెట్టుకోవడానికి ముందు ఆ తల్లుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలని సూచిస్తూ ఇరాన్ ఎంబసీ పోస్టు పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది మరణించడం, వారిలో చాలామంది చిన్నారులు ఉండటంతో ఈ సందర్భంగా ఆ విషాద ఘటనను గుర్తు చేసింది.

The post వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టుపై ఇరాన్ కీల‌క వ్యాఖ్య‌లు appeared first on Navatelangana.