← Back to headlines

ఆర్ఆర్‌పై విజయం.. అలా బ్యాటింగ్ చేయడం కష్టం: కోచ్

2026-05-10 07:19 • original

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధిచింది. ఈ మ్యాచ్‌లో విజయానికి కారణం కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లే అని బ్యాటింగ్ కోచ్ మాథ్యూ అన్నారు.

‘‘300 స్ట్రైక్‌రేట్‌తో 30 పరుగులు చేయడం ఉత్తేజకరంగా అనిపించినా.. 220 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధిస్తుంటే నిలకడగా.. సుదీర్ఘ సమయం క్రీజు‌లో ఉండటం అవసరం. మా వద్ద ఉన్న టాప్-3 ఆటగాళ్లు 150 స్ట్రైక్‌రేట్‌తో నిలకడగా ఆడగలరు. వాస్తవానికి అలా బ్యాటింగ్ చేయడం కష్టం. కానీ, మా వాళ్లు సుదీర్ఘ కాలంగా నిలకడగా ఆడుతున్నారు. వాళ్ల, ఫిట్‌నెస్, టెస్టులు, వన్డేలు ఆడిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతోందని’’ హేడెన్ పేర్కొన్నారు.