← Back to headlines

కరీంనగర్ లో పెళ్లి మండపంలోకి ప్రియురాలు ఎంట్రీ... ఆగిన ప్రియుడి పెళ్లి

2026-05-10 06:19 • original

కరీంనగర్: ప్రియుడు మరో యువతితో పెళ్లి చేసుకుంటుండగా ప్రియురాలు పెళ్లి మండపంలోకి రావడంతో వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్యాల పల్లి గ్రామానికి చెందిన పిడుగు నరేష్(25) అనే యువకుడు, హనుమకొండకు చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. గత 11 సంవత్సరాల ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి పేరుతో ఆమెను ప్రియుడు పలుమార్లు లొబరుచుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమ్మని అడగడంతో వివాహానికి అతడు నిరాకరించాడు. చొప్పదండి మండలానికి చెందిన ఓ యువతితో నరేష్ పెళ్లి జరుగుతున్న విషయం ప్రియురాలు తెలుసుకుంది. వెంటనే హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు అంజలి కాదర్, పలువురు మహిళలు, పోలీసులతో కలిసి పెళ్లి మండపానికి వెళ్లింది. పెళ్లి మండపంలో ప్రియురాలు కనిపించడంతో ఒక్కసారిగా వరుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పెళ్లి ఆగిపోయింది. చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో ప్రియురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.