← Back to headlines

ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

2026-05-08 12:35 • original

నవతెలంగాణ – ఆలేర్ రూరల
ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్,పిఎసిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం ప్రారంభించారు.శిబిరంలో భాగంగా 35 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స అందించడంతో పాటు లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.అలాగే వేసవికాలంలో పశు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.పశువుల మేత కొరత నివారణకు గడ్డి విత్తనాలను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శారజీపేట పశువైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి,ఆలేరు పశువైద్యాధికారి డాక్టర్ చైతన్య, విఎల్ఓ శ్రీనివాస్,ఓఎస్ నర్సిములు,గోపాలమిత్రలు సుధాకర్, కృష్ణ, అశోక్, కుమారస్వామి, వెంకటేష్,అనిల్,వేణు,స్వామి పాల్గొన్నారు.అలాగే గ్రామ పాలకవర్గ సభ్యులు, పాడి రైతులు అంజిరెడ్డి,మధు,బిక్షపతి,లింగం, శ్రీధర్,ఐలయ్య,వెంకటేష్,శ్రీకాంత్, మహిపాల్, స్వామి, నాగరాజు,రాజు తదితరులు హాజరయ్యారు.

The post ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం appeared first on Navatelangana.