← Back to headlines

కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు

2026-05-09 22:32 • original

ఎగసిపడిన మంటలుొ మూడు కార్లు, బైక్‌ దహనం
నవతెలంగాణ-కామారెడ్డి

ఓ షెడ్‌లో అక్రమంగా కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ప్రాంతంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులోకి డొమెస్టిక్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ను నింపుతుండగా జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగ చూట్టూ కమ్ముకుంది. ఈ ఘటనలో గ్యాస్‌ నింపుతున్న కార్‌తో పాటు ఆ రేకుల షెడ్డులో ఉన్న మరో రెండు కార్లు, బైక్‌ దహనమయ్యాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి వచ్చిన శబ్ధంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ పేలుడుకు కారణమైన షేడ్లు యజమానితో పాటు, గ్యాస్‌ ఏజేన్సి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా.. అక్రమంగా కార్లలో గ్యాస్‌ నింపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

The post కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు appeared first on Navatelangana.