← Back to headlines

నేడు ప్రధాని మోడీ రాక

2026-05-09 21:43 • original

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా రూ.9,400 కోట్లకు పైగా విలువైన అభివద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలు దేరి 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడి నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైటెక్‌ సిటీకి వెళ్తారు. 3.45గంటలకు సాయి సింధు క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గుజరాత్‌లోని జామ్‌ నగర్‌కు తిరిగి వెళ్తారు.

అభివృద్ధి కార్యక్రమాలు
-రూ.3,175 కోట్లతో చేపట్టనున్న (గూడెబెల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు) జాతీయ రహదారి-167కు శంకుస్థాపన చేస్తారు
-రూ.2,350 కోట్లతో 3,245 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేస్తారు
-రూ.1,700 కోట్లతో ఏర్పాటు చేసిన వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభోత్సవం చేస్తారు.
-రూ. 1,535 కోట్ల విలువైన కాజిపేట-విజయవాడ మల్టి ట్రాకింగ్‌తో పాటు పలు కీలక రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు.
-రూ.600 కోట్లతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అభివద్ధి చేసిన మల్కాపూర్‌ టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారు.

The post నేడు ప్రధాని మోడీ రాక appeared first on Navatelangana.