న్యూఢిల్లీ : ఐదేండ్ల తర్వాత కేంద్రం లేబర్ కోడ్స్‌ని అమల్లోకి తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించిన వివరాలను ప్రచురిం చింది. వేతనాల కోడ్, 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 అనే నాలుగు కోడ్‌లు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. 29 లేబర్ కోడ్లను సరళీకరించి నాలుగు కోడ్‌లుగా మార్చారు. కాగా, నాలుగు కోడ్‌ల క్రింద ఉన్న నిబంధనలు ఇప్పుడు ప్రభుత్వ అధికారిక గెజెట్‌లో నోటిఫై చేయబడ్డాయని, దీనితో కార్మిక చట్టాల పూర్తి అమలు ప్రక్రియ పూర్తయిందని ఒక అధికారి పీటీఐకి తెలిపారు. నవంబర్ 21, 2025న కార్మిక చట్టాలు దేశ చట్టంగా మారినప్పటికీ, నిబంధనలు లేకపోవడం వల్ల కొన్ని వివరణలు ఇవ్వలేదని ఆయన వివరించారు. భాగస్వాముల నుండి అభిప్రాయ సేకరణ కోసం ముసాయిదా నియమాలను డిసెంబర్ 30, 2025న ప్రచురించారు. చట్టపరమైన పరిశీలన తర్వాత వాటిని నోటిఫై చేశారు. కొత్త చట్టాలను పూర్తిగా అమలులోకి తీసుకురావడానికి నాలుగు కోడ్‌ల కింద నియమాలను తాజాగా ప్రచురించడం జరిగింది అని అధికారి తెలిపారు.
The post లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చిన కేంద్రం appeared first on Navatelangana.