← Back to headlines

విజయ్‌కి లైన్ క్లియర్.. మరికాసేపట్లో గవర్నర్‌తో భేటీ

2026-05-08 11:48 • original

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న గందరగోళానికి తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన టివికె పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన శాసనసభ సభ్యుల మద్దతు లభించడంతో విజయ్ శుక్రవారం గవర్నర్‌తో భేటీ అయ్యి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టివికె 108 స్థానాల్లో గెలిచింది. అయితే విజయ్ రెండు చోట్ల పోటీ చేయడంతో ఆ సంఖ్య బలం 107కు పడిపోయింది.

అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 118. దీని కోసం విజయ్ చిన్న పార్టీల నుంచి మద్దతు కోరుతూ చర్చలు జరిపారు. అయితే అన్నికంటే ముందుగా కాంగ్రెస్ టివికెకు మద్దతు ఇచ్చింది. తాజాగా వామపక్షలు, విసికె కూడా టివికెకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. దీంతో టివికె స్థానాలు 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, విసికె 2 స్థానాల సంఖ్య బలం కలిసి.. పూర్తిగా 118కి చేరింది. తమ పార్టీకి మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 2, సిపిఐ, సిపిఎం, విసికెలకు ఒక్కో మంత్రి పదవి ఇస్తారని సమాచారం.