← Back to headlines

హెచ్ 1 బి ఉద్యోగ వేతనాలు పెంపు

2026-05-09 17:38 • original

హెచ్ 1 బి ఉద్యోగాలలోకి తీసుకునే ఐటి నిపుణులకు వేతనాలు పెంచేందుకు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ మార్చి 27నే నిర్ణయం తీసుకుందని వెల్లడైంది.,ఈ ప్రతిపాదన మేరకు హెచ్ 1 బి వర్కర్లకు కనీస వేతనాలు ఇప్పుడున్న దానితో పోలిస్తే 30 శాతం పెరుగుతాయి. విదేశీ యువ ప్రతిభ తక్కువ వేతనాలకు పనిచేయడం వల్ల అమెరికా జాతీయులకు కలుగుతున్న నష్టం నివారణకు ఈ చర్యకు దిగారని వెల్లడైంది. పలు కేటగిరిలలో పనిచేసే హెచ్ 1 బి ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు ప్రతిపాదించినట్లు ఇప్పుడు అధికారికంగా తెలిపారు. ఇందంతా కూడా వేతన భద్రత , అమెరికా ఉద్యోగుల పరిరక్షణ దిశలో తీసుకున్న చర్యగా తెలిపారు. ఈ ప్రతిపాదనలపై ప్రజల స్పందనకు ఈ నెల 26 వరకూ గడువు ఖరారు చేశారు. ప్రవేశస్థాయి ఉద్యోగాలలో ఇప్పుడున్న 97వేలకు పైగా డాలర్ల వేతనం 33 శాతం హెచ్చింపు క్రమంలో ఇకపై 1,23,212 వరకూ చేరుతుంది. ఇక లెవల్ 2, 3 ఇతరత్రా కేటగిరి ఉద్యోగాలకు కూడా వేతనాల సవరణ సిఫార్సులు వెలువరించారు.