← Back to headlines

ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌

2026-05-09 17:16 • original

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భరత్‌ భూషణ్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డిసి చైర్మన్‌గా నియమితులయ్యారు. సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో 20 ఏళ్ళుగా పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేస్తూ ఎన్నో విజయ వంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు భరత్‌ భూషణ్‌. అలాగే భరత్‌ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయ పరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఇటీవల ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు వైస్‌ ప్రెసిడెంట్‌గానూ ఆయన ఎన్నికయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భరత్‌ భూషణ్‌ని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడం హర్షించదగిన విషయం. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివద్ధి పై ప్రత్యేక దష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భరత్‌ భూషణ్‌ని చైర్మన్‌గా నియమించి రాష్ట్రంలో ఈ సంస్థ అభివద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమితులైన భరత్‌భూషణ్‌కి బాలకష్ణ అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఏపీఎఫ్‌డీసీని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయనకు బాలకృష్ణ సూచించారు.

The post ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌ appeared first on Navatelangana.